<font face="mangal" size="3">&#3114;&#3149;&#3120;&#3100;&#3122;&#3093;&#3137; &#3125;&#3135;&#3112;&#3135;&#3119;&#3147;&#3095;&#3110;&#3134;&#3120;&#3137;&#3112;&#3135; &#3128;&#3143;&#3125;&#3112;&#3137; &#3077;&#3074;&#3110;&#3135;&#3074;&#3098;&#3105;&#3074; &#3122;&#3147; &#3114;&#3112;&#3135 - ఆర్‌బిఐ - Reserve Bank of India

RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78495854

ప్రజలకు వినియోగదారుని సేవను అందించడం లో పనితీరు ఆధారంగా మాస్టర్ డైరెక్షన్ - కరెన్సీ పంపిణీ మరియు మార్పిడి పథకం సమీక్ష (CDES)

ఆర్బిఐ/DCM/2016-17/36
మాస్టర్ డైరెక్షన్ DCM (CC) No.G-4/03.41.01/2016-17

జూలై 20, 2016

అధ్యక్షుడు & నిర్వాహక సంచాలకులు/
ముఖ్య కార్యనిర్వాణ అధికారి
అన్ని బ్యాంకులు

మేడం / డియర్ సర్,

ప్రజలకు వినియోగదారుని సేవను అందించడం లో పనితీరు ఆధారంగా
మాస్టర్ డైరెక్షన్ - కరెన్సీ పంపిణీ మరియు మార్పిడి పథకం సమీక్ష (CDES)

భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45 మరియు ప్రవేశిక మరియు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 35A ప్రకారం, మా శుభ్రమైన నోట్ల విధానం (క్లీన్ నోట్ పాలసీ) యొక్క లక్ష్యాలను అమలు సాధనకు రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలు/సూచనలు జారీచేస్తుంది. ఈ లక్ష్యాలను కొనసాగించడానికి, అన్ని బ్యాంకు శాఖలు ప్రజా సభ్యులకు మెరుగైన వినియోగదారు సేవలను అందించేలా చేయడానికి కరెన్సీ పంపిణీ మరియు మార్పిడి పథకం సమీక్ష (CDES) పేరుతో ప్రోత్సాహకాల పథకాన్ని రూపొందించింది.

2. జతపర్చిన మాస్టర్ డైరెక్షన్ ఈ అంశంపై నవీకరించబడిన మార్గదర్శకాలు/సర్కులర్లను కలిగి వుంది. కాలానుసారంగా తాజా సూచనలను జారీచేసినప్పుడు, ఎప్పటికప్పుడు అవి మాస్టర్ డైరెక్షన్ లో నవీకరించబడతాయి.

3. ఈ మాస్టర్ డైరెక్షన్ రిజర్వు బ్యాంకు వెబ్ సైట్ www.rbi.org.in. లో ఉంచబడింది.

మీ విధేయులు,

(పి.విజయ కుమార్)
చీఫ్ జనరల్ మేనేజర్

జతచేసినది: పైన పేర్కొన్న విధంగా


అనుబంధం

1. పరిచయం -

అన్ని బ్యాంక్ బ్రాంచీలు శుభ్రమైన నోట్ల విధానం (క్లీన్ నోట్ పాలసీ) యొక్క లక్ష్యాలతో, నోట్లు మరియు నాణేల మార్పిడికి సంబంధించి ప్రజలందరికీ మెరుగైన వినియోగదారు సేవలను అందించేలా చేయడానికి, కరెన్సీ చెస్ట్ లతో సహా బ్యాంకు శాఖల కోసం కరెన్సీ పంపిణీ మరియు మార్పిడి పథకం (CDES) ఉద్దేశించబడింది.

2. ప్రోత్సాహకాలు

పథకం ప్రకారం, నోట్లు మరియు నాణేల మార్పిడి సదుపాయాలను అందించడానికి, బ్యాంకులు క్రింది ఆర్థిక ప్రోత్సాహకాల కోసం అర్హులు:

క్రమ సంఖ్య సేవ వివరణ ప్రోత్సాహకాల వివరాలు
i)

బ్యాంకింగ్ తక్కువ వున్న రాష్ట్రాలలో 1 లక్ష కన్నా తక్కువ జనాభా కలిగిన కేంద్రాలలో కరెన్సీ చెస్ట్ తెరవడం మరియు నిర్వహించడం.

a. మూలధన వ్యయం: కరెన్సీ చెస్ట్ కు రూ.50 లక్షల పరిమితికి సంబంధించిన మూలధన వ్యయంలో 50% తిరిగి చెల్లించడం. నార్త్ ఈస్ట్రన్ ప్రాంతంలో 100% వరకు మూలధన వ్యయం, రూ.50 లక్షల పరిమితికి లోబడి తిరిగి చెల్లించడం.

బి. రెవెన్యూ వ్యయం: మొదటి 3 సంవత్సరాల్లో 50% రెవెన్యూ వ్యయాన్ని తిరిగి చెల్లించడం. నార్త్ ఈస్ట్రన్ ప్రాంతంలో 50% రెవెన్యూ వ్యయం మొదటి 5 సంవత్సరాలు తిరిగి చెల్లించబడుతుంది.

ii)

బ్యాంక్ బ్రాంచీల చిరిగిన/పాతబడిన నోట్లను పరీక్షించి వాటి మూల్యాన్ని తిరిగి చెల్లించడం.

a. పాతబడిన నోట్ల మార్పిడి - రూ.50 విలువ కలిగిన నోట్ల వరకు, ఒక ప్యాకెట్ నోట్ల మార్పిడి కోసం రూ.2

బి. చిరిగిన నోట్ల మార్పిడి - ఒక నోట్ కు రూ.2

iii)

కౌంటర్లో నాణేల పంపిణీ.

i. కౌంటర్లో నాణేల పంపిణీ కోసం ఒక బ్యాగ్ కు - రూ.25

ii. బ్యాంకుల నుండి క్లెయిమ్స్ కోసం ఎదురుచూడకుండా, కరెన్సీ చెస్ట్ నుండి ఉపసంహరణ ఆధారంగా ప్రోత్సాహకాలు చెల్లించబడతాయి.

iii. ఎక్కువ మొత్తంలో నాణేలు మార్పిడి చేసే వారికి కాక చిన్న మొత్తంలో మార్పిడి చేసే వారికి ప్రాధాన్యత ఇచ్చేలా బ్యాంకులు చూడాలి

iv. నాణేల పంపిణీని ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కరెన్సీ చెస్ట్/శాఖల అజ్ఞాత సందర్శన ద్వారా తనిఖీ చేయాలి.

iv)

ప్రజలకు నగదు సంబంధిత రిటైల్ సేవలను విస్తరించే యంత్రాల సంస్థాపన -

1. క్యాష్ రీసైక్లర్స్;

2. తక్కువ విలువ కలిగిన నోట్లను అందించే ATM లు (అంటే, రూ.100 విలువ వరకు)

గమనిక - రూ.500 లేదా అంతకంటే ఎక్కువ విలువ నోట్లను పంపిణీ చేసే ATM లు ఈ ప్రోత్సాహానికి అర్హులు కావు.

యంత్రాల కోసం గరిష్ట మొత్తాలను తిరిగి చెల్లించడం ఈ క్రింది విధంగా జరుగుతుంది

మెట్రో / పట్టణ ప్రాంతాల కొరకు -

1. క్యాష్ రీసైక్లర్స్ - యంత్రం యొక్క వాస్తవ వ్యయంలో 50% లేదా రూ.2,00,000/-, ఏది తక్కువ ఐతే అది.

2. తక్కువ విలువ కలిగిన నోట్లను అందించే ATM లు (అంటే, రూ.100 విలువ వరకు) - యంత్రం యొక్క వాస్తవ వ్యయంలో 50% లేదా రూ.2,00,000/-, ఏది తక్కువ ఐతే అది.

సెమీ-పట్టణ / గ్రామీణ ప్రాంతాల కొరకు -

1. క్యాష్ రీసైక్లర్స్ - యంత్రం యొక్క వాస్తవ వ్యయంలో 60% లేదా రూ.2,50,000/-, ఏది తక్కువ ఐతే అది.

2.తక్కువ విలువ కలిగిన నోట్లను అందించే ATM లు (అంటే, రూ.100 విలువ వరకు) - యంత్రం యొక్క వాస్తవ వ్యయంలో 60% లేదా రూ.2,50,000/-, ఏది తక్కువ ఐతే అది.

3. ప్రోత్సాహకాలు పొందేందుకు కార్యాచరణ మార్గదర్శకాలు -

3.1 పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు -

i) ఆర్బిఐ యొక్క జారీ కార్యాలయంలో వాస్తవంగా స్వీకరించబడిన చిరిగిపోయిన నోట్లపై ప్రోత్సాహకాలు చెల్లించబడతాయి. ఈ విషయంలో బ్యాంకులు వేరొక క్లైమును సమర్పించాల్సిన అవసరం లేదు. కరెన్సీ చెస్ట్ శాఖ ప్రో-రేటా ప్రాతిపదికన వారిచే ఇవ్వబడిన సాయిల్డ్ నోట్లకు లింక్ శాఖలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి

ii) అదేవిధంగా, ఆర్బిఐకి సీల్డ్ కవర్లో రిజిస్టర్డ్/ బీమా పోస్టు ద్వారా ప్రత్యేకంగా పంపిన నోట్లు/ పరీక్షించి విలువ చెల్లించబడిన నోట్లు పాత నోట్లతో పంపినప్పుడు, ప్రోత్సాహకం చెల్లించబడుతుంది. ఈ విషయంలో బ్యాంకులు వేరొక క్లైమును సమర్పించాల్సిన అవసరం లేదు.

3.2 యంత్రాల సంస్థాపనకు ప్రోత్సాహకాలు

i) జూలై 01 నుండి జూన్ 30 వరకు కాలంలో కరెన్సీ చెస్ట్ ప్రారంభించడం, పలు యంత్రాలను కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన బ్యాంకులు, సంబంధిత సంవత్సరం ఏప్రిల్ 15 నాటికీ జారీ కార్యాలయాలకు, యంత్రాల వివరాలను మరియు ఖర్చులను కలిగి ఉన్న వారి వార్షిక ప్రణాళికను సమర్పించవచ్చు. ప్రణాళికలను అందుకున్నప్పుడు, ఆ సంవత్సరానికి ప్రతి బ్యాంకుకి అనుమతించిన గరిష్ట మొత్తాన్ని, జారీ కార్యాలయాలు సూచించవచ్చు.

ii) క్యాష్ రీసైక్లర్లు మరియు తక్కువ విలువ కలిగిన నోట్లను అందించే ATM లు (అంటే, రూ.100 విలువ వరకు) సంస్థాపన జరిపినప్పుడు, అట్టి సమాచారాన్ని ప్రోత్సాహకాల కోసం త్రైమాసిక ప్రాతిపదికన, ఆర్బిఐ యొక్క సంబంధిత జారీ కార్యాలయాలకు, త్రైమాసికం ముగిసిన 30 రోజులలో బ్యాంకు యొక్క లింక్ ఆఫీసు ద్వారా సమర్పించాలి. ఏదేమైనా ఇటువంటి క్లైములు యంత్రాలు కోసం విక్రేతలకు పూర్తి చెల్లింపు చేసిన తర్వాత మాత్రమే సమర్పించాలి.

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి.

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: null

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?