<font face="mangal" size="3">&#3128;&#3138;&#3093;&#3149;&#3127;&#3149;&#3118;, &#3098;&#3135;&#3112;&#3149;&#3112; &#3118;&#3120;&#3135;&#3119;&#3137; &#3118;&#3111;&#3149;&#3119;&#3108;&#3120;&#3129;&#3134; &#3114;&#3120;&#3135;&#3126;&#3149;&#3120;&#3118;&#3122; (&#3086;&#3074;&#3086;&#3128;&#3 - ఆర్‌బిఐ - Reserve Bank of India

RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78507669

సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) రంగం – అడ్వాన్సుల పునర్వ్యస్థీకరణ

ఆర్‌బిఐ/2020-21/17
DoR.No.BP.BC/4/21.04.048/2020-21

ఆగస్టు 6, 2020

అన్ని వాణిజ్య బ్యాంకులు (చిన్న ఆర్థిక బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా)
అన్ని ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకులు/రాష్ట్ర సహకార బ్యాంకులు/జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు/అఖిల భారత ఆర్థిక సంస్థలు/అన్ని బ్యాంకింగేతర సంస్థలు

మేడమ్/ ప్రియమైన సర్,

సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) రంగం – అడ్వాన్సుల పునర్వ్యస్థీకరణ

ఫై అంశంపై ఫిబ్రవరి 11, 2020 నాటి సర్క్యులర్ DoR.No.BP.BC.34/21.04.048/2019-20 చూడండి.

2. కోవిడ్ 19 మూలంగా, ఆచరణీయమైన ఎంఎస్‌ఎంఇ ఎంటిటీలకు మద్దతు ఇవ్వడం మరియు ఈ మార్గదర్శకాలను కోవిడ్ 19 కోసం రిజల్యూషన్ ఫ్రేంవర్క్ తో అనుసంధానించడం -ఇతర అడ్వాన్సుల కోసం ప్రకటించిన సంబంధిత ఒత్తిడి మొదలగు వాటికై, పైన పేర్కొన్న సర్క్యులర్ ప్రకారం అనుమతించిన పథకాన్ని పొడిగించాలని నిర్ణయించడమైనది. దీని ప్రకారం, ' ప్రామాణికంగా’ వర్గీకరించబడిన ఎంఎస్‌ఎంఇ లకు ఉన్న రుణాలు ఈ క్రింది షరతులకు లోబడి ఆస్తి వర్గీకరణలో డౌన్గ్రేడింగ్ లేకుండా పునర్వ్యస్థీకరించబడతాయి:

  1. బ్యాంకులు మరియు బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్‌బిఎఫ్‌సి) ద్వారా రుణగ్రహీతకు, మొత్తం ఎక్స్పోజర్, నిధులేతర సదుపాయాలతో సహా, మార్చి 1, 2020 నాటికి 25 కోట్లు మించకూడదు.

  2. మార్చి 1, 2020 నాటికి రుణగ్రహీత ఖాతా ‘ప్రామాణిక ఆస్తి’ గా ఉండాలి.

  3. రుణగ్రహీత ఖాతా యొక్క పునర్వ్యస్థీకరణ మార్చి 31, 2021 నాటికి అమలు చేయాలి.

  4. రుణాలు తీసుకునే సంస్థ పునర్వ్యస్థీకరణ అమలు తేదీన జిఎస్‌టి-నమోదు చేయబడి ఉండాలి. అయితే, జిఎస్‌టి-నమోదు నుండి మినహాయింపు పొందిన ఎంఎస్‌ఎంఇలకు ఈ షరతు వర్తించదు. మార్చి 1, 2020 నాటికి మినహాయింపు పరిమితి ఆధారంగా ఇది నిర్ణయించబడుతుంది.

  5. ప్రామాణికంగా వర్గీకరించబడిన రుణగ్రహీతల యొక్క ఆస్తి వర్గీకరణను అలాగే ఉంచవచ్చు, అయితే మార్చి 2, 2020 మరియు అమలు తేదీ మధ్య ఎన్‌పిఎ వర్గంలోకి జారిపోయిన ఖాతాలను అమలు చేసిన తేదీ నాటికి 'ప్రామాణిక ఆస్తి'గా అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ సర్క్యులర్ యొక్క నిబంధనల ప్రకారం పునర్వ్యస్థీకరణ జరిగితేనే, ఆస్తి వర్గీకరణ ప్రయోజనం లభిస్తుంది.

  6. ఇంతకు ముందు విధంగా, ఈ మార్గదర్శకాల ప్రకారం పునర్వ్యస్థీకరణ జరిగిన ఖాతాల కోసం, బ్యాంకులు తమ వద్ద ఇప్పటికే ఉన్న ప్రొవిజన్స్ కంటే 5% అదనపు ప్రొవిజన్లను ఏర్పరచుకోవాలి.

3. ఫిబ్రవరి 11, 2020 నాటి సర్క్యులర్‌లో పేర్కొన్న అన్ని ఇతర సూచనలు వర్తిస్తాయి.

మీ విధేయులు,

(సౌరవ్ సిన్హా)
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-ఛార్జ్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి.

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: null

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?