<font face="mangal" size="3">&#3087;&#3103;&#3135;&#3119;&#3074; &#3122; &#3125;&#3134;&#3105;&#3093;&#3074; - &#3081;&#3098;&#3135;&#3108; &#3087;&#3103;&#3136;&#3086;&#3118;&#3149;&zwnj; &#3122;&#3134;&#3125;&#3134;&#3110;&#3143;&#3125;&#3136;&#3122; &#3095;&#3137;&#3120;&#3135;&#3074;&#3098;&#31 - ఆర్‌బిఐ - Reserve Bank of India

RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78520817

ఏటియం ల వాడకం - ఉచిత ఏటీఎమ్‌ లావాదేవీల గురించి స్పష్టీకరణ.

ఆర్.బి.ఐ/2019-20/41
డి.పి.యస్.యస్.సీఓ.పిడి.నం.377/02.10.002/2019-20.

ఆగష్టు 14, 2019

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కలుపుకుని)/
పట్టణ సహకార బ్యాంకులు/రాష్ట్ర సహకార బ్యాంకులు/
జిల్లా కేంద్రీయ సహకార బ్యాంకులు/చిన్న ఋణాల బ్యాంకులు/
చెల్లింపుల బ్యాంకులు/వైట్ లేబుల్ ఏటియం ఆపరేటర్లు.

మేడమ్/సర్,

ఏటియం ల వాడకం - ఉచిత ఏటీఎమ్‌ లావాదేవీల గురించి స్పష్టీకరణ.

పై విషయంమీద మా సర్క్యులర్ డి.పి.యస్.యస్. సీఓ. పిడి .నం. 316/02.10.002/2014-15 తేదీ ఆగష్టు 14, 2014 మరియు డి.పి.యస్.యస్. సీఓ. పిడి .నం. 659/02.10.002/2014-15 తేదీ అక్టోబర్ 10, 2014 లను పరికించండి.

2. సాంకేతిక కారణాల వల్ల, ఏటీఎమ్‌లలో నగదు లభ్యత లేనందున, తదితర కారణాలవల్ల విఫలమైన లావదేవీలను సైతం బ్యాంకులు ఉచిత లావాదేవీల సంఖ్య కింద లెక్కించుతున్నఉదంతాలు ఆర్‌బీఐ దృష్టికి వచ్చాయి.

3. ఈ నేపథ్యంలో స్పష్టీకరణ చేసేదేమిటంటే : సాంకేతిక కారణాలతో అంటే.. హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, కమ్యూనికేషన్‌ సమస్యల వల్ల, ఏటీఎమ్‌లలో ఒక్కోసారి డబ్బులు ఉండవు అపుడు నగదు ఉపసంహరణకు ప్రయత్నిస్తే అది విఫల లావాదేవీగా అవుతుంది, పిన్‌ నంబరు తప్పుగా కొట్టినపుడు/సక్రమత పాటించకపోవడం మూలాన జరిగే విఫల లావాదేవీలు, బ్యాంకులను/వారి సేవా ప్రదాతలను ప్రత్యక్షంగా లేక మొత్తంమీద ఆరోపింప అవకాశంలేని ఎటువంటి లావాదేవీ విఫలమైనా, దానిని ఏటీఎమ్‌ లావాదేవీ జరిగినట్లుగా లెక్కించరాదు. మొత్తం మీద పై కారణాల వల్ల జరిగే విఫల ఏటీఎమ్‌ లావాదేవీలపై బ్యాంకులు ఛార్జీలు విధించ కూడదు.

4. ‘ఆన్-అజ్’ లావాదేవీలుగా రూపుదిద్దబడిన (అంటే యే బ్యాంకు కార్డు జారిచేసిందో ఆ బ్యాంకు ఏటియం లో వాడబడినపుడు)నగదేతర ఉతరా యింపు లావాదేవీలను కూడా (నగదు ఎంత ఉందో చూసుకోవడం, చెక్‌ పుస్తకం కోసం విజ్ఞప్తి పంపడం, పన్నుల చెల్లింపు, నగదు బదిలీల వంటి వాటిని) ఉచిత ఏటీఎమ్‌ లావాదేవీల సంఖ్యలో చూపరాదు.

5. చెల్లింపులు మరియు పరిష్కార వ్యవస్థ ల చట్టం, 2007 (2007 యొక్క చట్టం 51) సెక్షన్ 18 తో పాటు సెక్షన్ 10(2) క్రింద ఈ ఆదేశం (డైరెక్టివ్) జారీ చేయబడుతున్నది.

మీ విధేయులు

(పి.వాసుదేవన్)
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-చార్జ్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి.

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: null

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?